వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
By AV
On
వైట్ కాలర్స్‌లో విభిన్న స్పందన....
- గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటున్న నేతలు...
- నేనంటే నేనంటున్న వైనం...
- చిత్తశుద్ధి లేకుండా చేసే కార్యంలో ఈ వింత పోకడ ఎందుకో...
అక్షర దర్బార్/కేసముద్రం....
సామాన్యుల పంచాయతీలను వ్యాపారంగా మలుచుకున్న పలువురు పెద్దమనుషుల తీరుపై అక్షరం దర్భార్ పత్రిక ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దీనిపై భిన్నమైన స్పందన రాగా.. పలువురి తీరుమాత్రం తీవ్ర విమర్శలపాలయ్యే దుస్థితి తెచ్చుకున్నారు.గుమ్మడికాయల దొంగలు ఎవరంటే.. భుజాలు తడుముకున్న మాదిరిగా.. వ్యవహరిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని పలు గ్రామాల వైట్ కాలర్స్ పెద్దమనుషులు తీరును ప్రశ్నిస్తూ.. ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది అక్షరం దర్జార్. దీనిపై ప్రజల్లో హర్షాతిరేకలు రాగా.. అదే పనిగా పెట్టుకున్న పలువురి వైట్ కాలర్స్‌కి మాత్రం జీర్ణుంచుకోలేని అంశంగా మారింది.పలువురైతే.. కథనంపై,కథనం ప్రచురించిన వారిపై కేసులు పెడతామని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి.వాస్తవంగా ఎవరు ఇలా ఉన్నారు.. ఎవరు పంచాయతీలు చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు.. ఎవరు పేదల,సామాన్యుల డబ్బులు డిపాజిట్ల రూపంలో లాగేస్తున్నారు అనేది ఆలోచన చేయకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇలా ఒంటెద్దు పోకడలకు యత్నిస్తున్న పరిస్థితి.కేసముద్రం మండలంలో ఈ వ్యవహరం పరిపాటిగా మారినప్పటకీ... మారాల్సిన వారిలో మార్పు రాకపోవడమే ఇక్కడ సమస్యగా మారింది. అధికారుల చట్టూ,చట్టాల చుట్టూ తిరగలేక.. చుట్టంలాగా,మనలో ఒకడిగా ఉన్నోడి దగ్గరే మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని పెద్దరికం అప్పజెప్తే.. అందినకాడికి లాగేసే మాదిరిగా పెద్దమనుషులు తయారైన దుస్థితినే ప్రశ్నించాలన్నది అక్షరం దర్బార్ ఉద్దేశం. వైట్ కాలర్ చొక్కాలు ఉండగానే కాదు.. నేతల వ్యవహర శైలి కూడా అదే విధంగా ఉండాలి. పేదలకు న్యాయం చేయాలి. డిపాజిట్ లేకుండా పంచాయతీలు చేయాలి. సామరస్యంగా పోయే వాటిని తీవ్ర రూపం దాల్చకుండా మద్యలోనే అడ్డుకట్ట వేసి పరిష్కరించాలి, అన్నదమ్ముల వివాదాలను కలిసి ఉండే విధంగా పరిష్కారం చూపాలి.భార్యభర్తల వివాదాలైతే.. చెప్పినా విననప్పుడు.. చట్టపరంగా వెళ్లాలని సలహాలు ఇవ్వాలి. అంతే కానీ.. దీన్ని దృష్టిలో లేకుండా ఇష్ఠానుసారంగా వ్యవహరిస్తాం, సామాన్యులను పట్టి పీడిస్తాం, అంతా నేను చెప్పిందే నడవాలి అనే ఒంటెద్దుపోకడ నాయకులను నడిబజార్లో నిలబెట్టి నిగ్గతీసి నిలదీసేందుకు అక్షరం దర్బార్ సిద్ధంగా ఉంది.ఇటీవల తరచు ఓ మేజర్ గ్రామపంచాయతీలలో జరిగిన ఘటనలే దీనికి నిదర్శనం అవుతాయి అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన ఓ పెద్దమనిషి శిష్యుని లీలలే దీనికి నిదర్శనం. ఇప్పటికైనా ఆ పెద్దమనిషి శిష్యుడు ఇలాంటి కృత్యాలు ఆపుతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి....

Tags:
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి
Published On
By AV
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి రూ.60 వేలకుపైగా నష్టం.. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాధితుడి వేడుకోలు అక్షరదర్బార్, నడికూడ: నడికూడ మండలంలోని కంటాత్మకూరు...
జనసభలోనే నా ప్రయాణం!
Published On
By RV
- ఓడినా వెనుకడుగు వేయలేదు.. ప్రజల మధ్యే నిరంతర పోరాటం
Read More... ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
Published On
By AV
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం టీపీయూఎస్ జిల్లా స్థాయి పురస్కారాలు అక్షరదర్బార్ నడికూడ: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) వరంగల్–హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం...
మూడు తరాలుగా సేవా సంకల్పం
Published On
By AV
మూడు తరాలుగా సేవా సంకల్పం ‘సేవా సంకల్ప్ అభియాన్’లో డా. సిరంగి సౌందరయ్య మనవడు రక్తదానం అక్షరదర్బార్,పరకాల: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల...