దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..

అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ..
దేశంలో బ‌లంగా కుల వివ‌క్ష‌..

  • అన్ని రంగాల్లోనూ వేళ్లూనుకొని ఉంది..
    * తెలంగాణ‌లో కుల గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శం
    * నిజం బ‌య‌ట‌కు రావొద్ద‌నే వాళ్లే అడ్డుకుంటున్నారు
    * ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ..
    * హైద‌రాబాద్‌లో మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలతో స‌మావేశం
  •  
  • అక్ష‌ర‌ద‌ర్బార్, హైద‌రాబాద్‌:  దేశంలో కుల వివ‌క్ష బ‌లంగా ఉంద‌ని, రాజ‌కీయ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌లోనూ పాతుకుపోయింద‌ని ఏఐసీసీ (aicc) అగ్ర‌నేత రాహుల్‌గాంధీ (rahul gandhi) అన్నారు. అగ్ర‌కులాల‌కు ఎప్పుడూ కుల వివ‌క్ష క‌న‌ప‌డ‌ద‌ని, దేశం స‌మ‌గ్రంగా అభివృద్ధి చెందాలంటే కుల వివ‌క్ష రూపుమాపాల‌ని రాహుల్ అన్నారు. తెలంగాణ‌లో రేప‌టి నుంచి ప్రారంభంకానున్న కుల గ‌ణ‌న దేశానికే ఆద‌ర్శ‌మ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు. కుల గ‌ణ‌న ద్వారా ఎవ‌రికీ న‌ష్టం క‌ల‌గ‌కుండా చూడొచ్చ‌ని, అంద‌రికీ స‌మ‌న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. నిజం బ‌య‌ట‌కు రావొద్ద‌నే వాళ్లే కుల గ‌ణ‌న‌ను అడ్డుకుంటున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు. 
  • కుల గ‌ణ‌న‌పై అభిప్రాయ సేక‌ర‌ణ‌
  •  
  • ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ (hyderabad) చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనకు సంబంధించి మేధావులు, పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాలతో బోయిన్‌ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వ‌హించిన సదస్సుకు హాజ‌ర‌య్యారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న రాహుల్‌.. అంత బిజీ షెడ్యూల్‌లోనూ కులగణన కార్యక్రమానికి సమయం కేటాయించారు. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బోయిన్‌పల్లిలోని గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌కు వెళ్లారు. టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సదస్సులో పాల్గొని నేతలతో చర్చించారు. కులగణనపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు    అక్షర దర్బార్, శాయంపేట : ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...
Read More...
ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .    - ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"    - రైతులపై కేసులు వద్దు.    - పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.    అక్షరదర్బార్, పరకాల:...
Read More...
రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....   – ప్రజల విజ్ఞప్తి.    అక్షర దర్బార్, పరకాల: నడికూడ మండలంలోని కంటత్మకూర్ వాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వాగు ఉధృతంగా పొంగిపొర్లి...
Read More...
కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.    42 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలీల కులస్తులు...
Read More...
పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.      కౌకొండ అభివృద్ధే అఖిలపక్ష లక్ష్యం    అక్షర దర్బార్ ,పరకాల: కౌకొండ గ్రామానికి మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు నిలిచిపోవడంపై అఖిలపక్షం హైవేపై...
Read More...
అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.