బిగ్ బ్రేకింగ్... ఎల్క‌తుర్తి ఎస్సైపై వేటు

బిగ్ బ్రేకింగ్... ఎల్క‌తుర్తి ఎస్సైపై వేటు

  • విధుల్లో నుంచి రాజ్‌కుమార్ స‌స్పెన్ష‌న్‌
  • ఉత్త‌ర్వులు జారీచేసిన సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా 
  • ఎస్సైపై కొంత‌కాలంగా అవినీతి ఆరోప‌ణ‌లు
  • అక్ర‌మాస్తుల కూడ‌బెట్టార‌ని విమ‌ర్శ‌లు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: హ‌న్మ‌కొండ జిల్లా ఎల్క‌తుర్తి ఎస్సై రాజ్‌కుమార్‌పై వేటు ప‌డింది. విధుల్లో నుంచి ఆయ‌న్ను సస్పెండ్ చేస్తూ వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌నర్ అంబ‌ర్ కిషోర్ ఝా ఉత్త‌ర్వులు జారీచేశారు. ఎస్సై రాజ్‌కుమార్‌పై కొంత‌కాలంగా అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. భూత‌గాదాల్లో త‌ల‌దూర్చుతున్నాడ‌నే ఫిర్యాదులు సైతం ఉన్న‌తాధికారులకు చేరిన‌ట్లు స‌మాచారం. అంతేగాక‌.. ఇటీవ‌ల అక్ర‌మాస్తులు కూడబెట్టార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈనేప‌థ్యంలోనే ఎస్సైపై సస్పెన్ష‌న్ వేటుప‌డ‌టం డిపార్ట్‌మెంట్‌లో చ‌ర్చనీయాంశ‌మైంది. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని మ‌రికొంద‌రిపైనా త్వ‌ర‌లోనే స‌స్పెన్ష‌న్ వేటు ప‌డే అవకాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎల్క‌తుర్తిలో ఎస్సైగా విధులు నిర్వ‌హించిన ఏ అధికారి కూడా స‌స్పెన్ష‌న్‌కు గురైన చ‌రిత్ర లేద‌ని.. ఇదే తొలిసారి అని స‌మాచారం.

Tags:

మహారాష్ట్రలో పెను విషాదం

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
రాజకీయం 
Read More...
మహారాష్ట్రలో పెను విషాదం

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి