ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

ఎంజీఎంలో మ‌హిళా ఉద్యోగిపై దాడి కేసు.. 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వరంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఎంజీఎంలో ఉద్యోగిని కొట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్న కిలాడీ లేడీని మ‌ట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేర‌కు ఏసీపీ నందిరాం నాయ‌క్ అరెస్టుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు.  బిల్ల సుమలత అనే మహిళ  15 సంవత్సరాల నుండి ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్‌లో రెండు ఏళ్లుగా పేషెంట్ కేర్‌గా ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం విధులలో భాగంగా బయోమెట్రిక్ తంబ్ పెడుతుండగా ఆలకుంట రాజమ్మ సదరు ఉద్యోగి బిళ్ళ సుమలతను అడ్డుకొని రెండు లక్షల లంచం ఇవ్వాల‌ని, ఈ జీవో తీసుకొచ్చింది తానేన‌ని, రెండు లక్షల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించింది. తన వెంట తెచ్చుకున్న చైన్‌తో సదరు ఉద్యోగిపై విచక్షణరహితంగా దాడి చేసింది. అంతేగాక ఆమె వ‌ద్ద గల  పదివేల రూపాయలు లాక్కొని మొబైల్ ను ధ్వంసంచేసింది. ఈ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బిళ్ళ సుమలత ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు ఆలకుంట రాజమ్మను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి వెయ్యి రూపాయల న‌గ‌దుతోపాటు చైన్ ను స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్‌కు పంపారు. WhatsApp Image 2024-09-10 at 6.58.26 PM (1)

 

Tags:

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.    తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.      డాక్టర్   అక్షర...
Read More...
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.    అక్షర దర్బార్, పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను...
Read More...
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.