అద్దెకు దిగి.. బ్యాంకు చోరీకి స్కెచ్

అద్దెకు దిగి.. బ్యాంకు చోరీకి స్కెచ్

  • ముఠాగా ఏర్పడిన రెండు రాష్ట్రాల సభ్యులు
  • హైదరాబాద్ లోని అద్దె ఇంట్లో ప్రణాళిక 
  • గూగుల్ ద్వారా రాయపర్తి బ్యాంకు ఎంపిక 
  • ముఠాలోని ముగ్గురు అరెస్టు.. నలుగురు పరార్ 
  • రూ 1.80 కోట్ల బంగారం, కారు రికవరీ
  • వివరాలను వెల్లడించిన వరంగల్ సిపి

గూగుల్ ద్వారా 
బ్యాంకు సెలక్షన్
 
- హైదరాబాదులో ఇల్లు అద్దెకు తీసుకొని చోరీకి స్కెచ్
- రెండు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు కలిసి ఒక ముఠాగా..
- పోలీసులకు చిక్కిన రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంక్‌ దోపిడి దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులు
- రూ.1.80 లక్షల బంగారం, ఓ కారు స్వాధీనం
 
అక్షరదర్బార్, హనుమకొండ:
గత నెల 18వ తేది ఆర్థ్రరాత్రి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో దోపిడికీ పాల్పడిన ఉత్తరప్రదేశ్‌, మహరాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు సుమారు ఒక కోటి ఎనబై లక్షల నాలుగువేల రూపాయల విలువ గల  రెండు 2కిలోల 520 గ్రాముల బంగారు అభరణాలు, ఒక కారు, పదివేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. అర్షాద్‌ అన్సారీ, తండ్రి పేరు అన్సారీ ఆహ్మద్‌, వయస్సు 34, షేహవాజ్‌పూర్‌, బుడాన్‌ తాలుకా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. 2. షాఖీర్‌ఖాన్‌ ఆలియాస్‌ బోలెఖాన్‌, తండ్రి పేరు నవాబ్‌ ఖాన్‌, వయస్సు 28, బుడాన్‌ తాలుకా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. 3. హిమాన్షు బిగాం చండ్‌ జాన్వర్‌, తండ్రిపేరు బిగాం చంద్‌, వయస్సు 30, మోటల గ్రామం, తాలుకా, బుల్దనా జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారు కాగా.
 
ప్రస్తుతం పరారీలో వున్న నిందితుల వివరాలు: మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌, తండ్రి పేరు జకీర్‌ అలీ, వయస్సు 39, కక్రలా గ్రామం, బదౌన్‌ జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం. 2. అక్షయ్‌ గజానన్‌ అంబోర్‌, తండ్రి పేరు గజానన్‌, వయస్సు 24, సైగావ్‌ గ్రామం, చికిల్లి తాలుకా, మహరాష్ట్ర. 3. సాగర్‌ భాస్కర్‌ గోర్‌, తండ్రి భాస్కర్‌ గోర్‌, వయస్సు 32, పునై మోటాల గ్రామం, బుల్దానా జిల్లా, మహరాష్ట్ర. 4.సాజిద్‌ ఖాన్‌, తండ్రిపేరు జకీర్‌ అలీ ఖాన్‌, వయస్సు 35, కక్రలా గ్రామం, బడాయు జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గుర్తించబడ్డారు.
 
ఈ అరెస్టు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా శుక్రవారం వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులతో పాటు, పరారీలో మరో నలుగురు నిందితులు కలిసి ఏడుగురు సభ్యులు ముఠాగా ఏర్పడ్డారు. పరారీలో వున్న ప్రధాన నిందితుడు మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌ కొద్ది రోజుల  కిందిత ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో వుండే బ్యాంక్‌లు, బ్యాంక్‌ భద్రత ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. అనంతరం నిందితుడు ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్రలకు చెందిన మిగితా నిందితులతో
కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వ్యాపారం ముసుగులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 
 
- గూగుల్ ద్వారా
ఈ ముఠా ముందుగా గుగూల్‌ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించడం జరిగింది. సేకరించిన సమచారంలో నిందితులు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ చోరీ అనువైనదిగా గుర్తించి ఈ బ్యాంక్‌లో చోరీ చేసేందుకు ఈ ముఠా సిద్దపడ్డారు. ఈ చోరీలో భాగంగా నవంబర్‌ 18తేది ఆర్థ్రరాత్రి తెల్లవారితే 19 తారీకున నిందితులు హైదరాబాద్‌ నుండి నిందితుల్లో ఒకడైన హిమాష్షు డ్రైవింగ్‌ చేస్తున్న  ఒక కారులో రాయపర్తి గ్రామ శివారు ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం కారును తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు రమ్మని కారుని వెనక్కి తిప్పి పంపారు. అనంతరం మిగితా అరుగురు నిందితులు పంట పోలాల ద్వారా రాయపర్తి కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ దక్షిణ భాగానికి రాత్రి 11 గంటలకు చేరుకోని అక్కడ వున్న కిటీకిని నిందితులు తోలగించి బ్యాంక్‌ లోనికి చొరబడిన ఈ ముఠా సభ్యులు ముందుగా బ్యాంక్‌ సెక్యూరీటీ అలారంతో పాటు, సిసి కెమెరాల వైర్లను నిందితులు కట్‌ చేసి ఇద్దరు నిందితులను తొలగించిన కిటీకి వద్ద కాపలగా వుంచి ప్రధాన నిందితుడితో సహ మరో నలుగురు నిందితులు  బ్యాంక్‌ స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టి, స్ట్రాంగ్‌ రూంలో వున్న మూడు లాకర్లను ఈ ముఠా తమ వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్లను వినియోగించి లాకర్లను కట్‌ చేసి అందులోవున్న సూమారు 13కోట్ల 61లక్షల రూపాయల విలువ గల బంగారు అభరణాలను వారి వెంట తెచ్చుకున్న సంచుల్లో వేసుకోని వారి వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్‌ ఇతర స్వామగ్రిని బ్యాంక్‌లో వదిలి వేయడంతో పాటు అక్కడి నుండి వెళ్ళే ముందు సిసి కెమెరాలకు సంబంధించిన డివిఆర్‌ను ఈ ముఠా ఎత్తికెళ్లారు. 
 
- చోరీ అనంతరం హైదరాబాదుకు
చోరీ అనంతరం నిందితులు వచ్చిన కారులో తిరిగి హైదరాబాద్‌ లో కిరాయి తీసుకున్న ఇంటికి చేరుకోని నిందితులు చోరీ సోత్తును ఏడు సమాన వాటాలు పంచుకున్నారు. నవంబర్‌ 19వ తేదిన నిందితులు మూడు బృందాలుగా విడిపోయి మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు తిరిగివెళ్ళిపోయారు. ఈ భారీ చోరీపై అప్రమత్తమైన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అదేశాల మేరకు  వెస్ట్‌జోన్‌ డిసిపి రాజమహేంద్ర నాయక్‌ నేతృత్వంలకో వర్థన్నపేట ఏసిపి నర్సయ్య, సిసిఎస్‌ ఏసిపి భోజరాజు, నర్సంపేట ఏసిపి కిరణ్‌కుమార్‌ల అధ్వర్యంలో పదికిపైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితులను పట్టుకోవడ కోసం ఈ ప్రత్యేక పోలీస్‌ బృందాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టి నిందితుల కదలికలపై ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరించి  ముగ్గురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు వారి నుండి చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
 
- అభినందనలు
ఈ భారీ చోరీని అతి స్వల్పకాలంలో చేధించడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్‌జోన్‌ డిసిపి రాజమహేంద్ర నాయక్‌, ఏసిపిలు నర్సయ్య, భోజరాజు, కిరణ్‌కుమార్‌, ఆత్మకూర్‌ , రఘునాథ్‌పల్లి, సిసిఎస్‌, వర్థన్నపేట, పాలకుర్తి, నర్మెట్ట, టాస్క్‌ఫోర్స్‌, పోలీస్‌ కంట్రోల్‌ రూంకు చెందిన ఇన్స్‌స్పెక్టర్లు సంతోష్‌, శ్రీనివాసరెడ్డి, బాలాజీ వరప్రసాద్‌, శివకుమార్‌, రఘుపతి రెడ్డి, శ్రీనివాస్‌రావు, మహెందర్‌ రెడ్డి, అబ్బయ్య, పవన్‌కుమార్‌, విశ్వేశ్వర్‌, ఏఏఓ సల్మాన్‌పాషాతో పాటు ఎస్‌ఐలు, ఇతర దర్యాప్తు పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.IMG-20241206-WA0021
Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు