క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..

క‌ల్తీ స‌రుకులు.. కాలంచెల్లిన ఉత్ప‌త్తులతో నయా దందా..

  • వ‌రంగ‌ల్‌లోని కిరాణ‌షాపు య‌జ‌మాని మాయాజాలం
  • ప‌క్కా స‌మాచారంతో టాస్క్‌ఫోర్స్ దాడులు
  • భారీగా కల్తీ, నకిలీ, కాలంచెల్లిన ఐట‌మ్స్ గుర్తింపు
  • సుమారు రూ. 8 లక్షల విలువ గల 196 రకాల ప‌దార్థాలు స్వాధీనం 
  • షాప్ య‌జ‌మానిపై కేసు.. 


అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌:  టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్‌లోని సంతోష్ కుమార్ కిరణం & జనరల్ స్టోర్స్‌లో వరంగల్ టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. కల్తీ, నాసిరకం, శుభ్రత పాటించకుండా, కాలం చెల్లిన తినుబండారాల‌ను గుర్తించారు. నగరంతోపాటు జిల్లా నలుమూలలకు సప్లయి చేసేందుకు సిద్ధంచేసిన బేక‌రీ ఐటంల‌ను స్వాధీనం చేసుకొన్నారు. అపరిశుభ్రంగా, నాసిరకంగా ఉన్న, కాలంచెల్లిన సుమారు రూ. 8 లక్షల విలువ గల 196 రకాల బేకరీ ఆహార ఉత్పత్తుల తయారీకి వాడే వివిధ ర‌సాయ‌నాలు, పౌడర్లు, చాక్లెట్ స్టిక్‌లు, కలర్ పేస్ట్ మొదలైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని షాప్ ఓనర్ అంచూరి సంతోష్ కుమార్‌పై కేసు న‌మోదు చేశారు. విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమక్షంలో ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించారు.

వ్యాపారస్తులకు సీపీ హెచ్చరిక
 
ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా,కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా వ్యాపారులపై చర్యలు తప్పవ‌ని సీసీ అంబ‌ర్‌కిశోర్ ఝా హెచ్చ‌రించారు.  ప్రముఖ బ్రాండ్‌లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచామ‌న్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే  వ్యాపారులపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. 

ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌

అపరిశుభ్ర, కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది, కాలంచెల్లిన తినుబండారాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు తిని.. చాలామంది అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. బయటి పదార్థాలు కొనే ముందు అందరూ కాలంచెల్లిన తేదీ వివరాలు చూసుకోవాలి. పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల.. విరేచనాలు, వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదర సంబంధ వ్యాధుల బారినపడుతారు అని పోలీస్ క‌మిష‌న‌ర్ అన్నారు. భారీ మొత్తంలో కల్తీ, కాలంచెల్లిన, అపరిశుభ్ర ఉత్ప‌త్తులు పట్టుకోవడంలో ప్రతిభకనపరచిన టాస్క్‌ఫోర్స్ ఏసీసీ మధుసూదన్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రంజిత్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ శరత్, ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకన్న, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, ఇంతేజార్గంజ్ పోలీసులను వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

 

 

 

 

Tags:

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన