గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

గిరిజ‌న యువ‌కుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం

  • లంచం ఇవ్వ‌లేద‌ని పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క‌బాదిన వైనం
  • పోలీస్ వాహ‌నంలోనే ద‌వాఖాన‌కు త‌ర‌లించిన సిబ్బంది
  • హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు

 అక్షర దర్బార్, తొర్రూరు : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన శనివారంరాత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం...పెద్దవంగర మండలం శంకర్ తండాకు చెందిన అనూషకు కేసముద్రం మండలం చప్పుడిగుట్ట తండాకు చెందిన బానోత్ రాజేష్‌తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషుల తీర్మానంతో రాజేష్ ఆస్తిని భార్యకు రాసిచ్చాడు. అయినా అనూష కేసుపెట్టింది. కేసులో రాజేష్‌ను ఎస్సై క్రాంతికుమార్ రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా, రూ.15,000 ఇచ్చాడు. మరో 20 వేలు ఇవ్వాలని ఎస్సై ఒత్తిడి చేయగా, డబ్బులు లేవని రాజేష్ చెప్పడంతో కోపంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఎస్సై , సిబ్బంది చితకబాదారు. గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ వాహనంలో తీసుకొని తొర్రూరులోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో చేర్పించి వెళ్ళిపోయారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడు.

Tags:

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..