భూకంపం@5.3

భూకంపం@5.3

  • కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి
  • ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం 
  • ఏమి జరిగిందని ఆందోళన
  • రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు 

భూకంపం 

- రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు

అక్షరదర్బార్, హనుమకొండ:

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం భూమి కంపించింది.. ఆందోళనతో ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం ఏమి జరిగిందని చర్చించుకుంటున్నారు.

7:28గంటలకి 10 సెకన్ల పాటు కంపించిన భూమితో ప్రజలు ఆందోళన చెందారు. స్వల్ప కాలమే భూమి కంపించి నట్లు కనిపించినా గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇలాంటి అనుభవం ఎదురుకాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మంచంపై నిద్రించిన వారికి, కూర్చున్న వారికి కొద్ది సెకన్ల పాటు అటూ ఇటూ ఊపినట్లి అనుభూతి చెందారు. దీంతో బయటికి వచ్చి చర్చించుకోవడం కనిపించింది.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో వస్తువులు కూడా భూమి కంపించిన సమయంలో కింద పడ్డాయి.

 

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు*

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం ఈరోజు ఉదయం 7:28 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు అయినట్లు తెలిసింది. ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారని తెలిసింది.

Tags:

మహారాష్ట్రలో పెను విషాదం

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
రాజకీయం 
Read More...
మహారాష్ట్రలో పెను విషాదం

తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు - బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్...
Read More...
తక్షణమే మున్సిపల్ ఎన్నికలు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కలెక్టరేట్‌లో అధికారికంగా ప్రకటించారు....
Read More...
పరకాల మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ అక్షర దర్బార్,నడికూడ:పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్...
Read More...
సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి