ఏసీబీ వలలో పీఆర్ ఏఈ

ఏసీబీ వలలో పీఆర్ ఏఈ

  • రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్
  • బిల్లు ఫైలు క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ 
  • వల పన్ని ఏఈని పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఏసీబీ వలలో పీఆర్ ఏఈ 
- రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్

అక్షరదర్బార్, వరంగల్: అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రభుత్వ శాఖల్లో లంచవతారాలను వలపన్ని పట్టుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఇంజనీరు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో  పంచాయతీరాజ్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఏఈ కార్తీక్ రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టు బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ వద్ద సతీష్ నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏఈ కార్తీక్ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కాడు. అనంతరం హనుమకొండలోని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

Tags:

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు    అక్షర దర్బార్, శాయంపేట : ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...
Read More...
ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .    - ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"    - రైతులపై కేసులు వద్దు.    - పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.    అక్షరదర్బార్, పరకాల:...
Read More...
రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....   – ప్రజల విజ్ఞప్తి.    అక్షర దర్బార్, పరకాల: నడికూడ మండలంలోని కంటత్మకూర్ వాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వాగు ఉధృతంగా పొంగిపొర్లి...
Read More...
కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.    42 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలీల కులస్తులు...
Read More...
పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.      కౌకొండ అభివృద్ధే అఖిలపక్ష లక్ష్యం    అక్షర దర్బార్ ,పరకాల: కౌకొండ గ్రామానికి మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు నిలిచిపోవడంపై అఖిలపక్షం హైవేపై...
Read More...
అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.