ఎస్సై హరీష్ సూసైడ్

ఎస్సై హరీష్ సూసైడ్

  • గన్ తో  కాల్చుకుని ఆత్మహత్య
  • ములుగు జిల్లాలో విషాదం 
  • చర్చనీయమైన ఎస్సై ఆత్మహత్య

 

గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య 

 

అక్షరదర్బార్, వాజేడు:

ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాజేడు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ముళ్లకట్ట వద్ద ఉన్న ఓ రిసార్ట్స్ గదిలో ఆయన తన రివాల్వర్ తో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. హరీష్ గతంలో పేరూరు ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీపై వాజేడుకు వచ్చినట్లుగా సమాచారం. ఎస్సై మృతి పోలీసు వర్గాల్లో చర్చనీయమైంది. ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వ్యక్తిగత కారణాలా, పని ఒత్తిడినా, అధికారుల చర్యలా అనే చర్చ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ హరీష్ ఆత్మహత్యతో పోలీస్ వర్గాల్లో విషాదం  చోటు చేసుకుంది. 2020 బ్యాచ్ కు చెందిన హరీష్ మొదట వాజేడులో ప్రొబేషనరీ ఎస్సైగా, ఆ తర్వాత పేరూరు ఎస్సైగా విధులు నిర్వహించి తిరిగి వాజేడు ఎస్సైగా ఆరు నెలల క్రితం వచ్చినట్లు తెలిసింది.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక- ఐలాపూర్ అడవుల్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఇదే ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం వాజేడులో పోలీస్ ఇన్ఫార్మర్లుగా పేర్కొంటూ మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసిన విషయం కూడా విధితమే. ఈ క్రమంలో వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ స్వగ్పారామం భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లె. హరీష్ కు ఇటీవల పెళ్లి నిశ్చయం జరిగినట్లు తెలిసింది.

IMG-20241202-WA0007

IMG-20241202-WA0006

Tags:

నా పనితీరే నా బలం

- భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా శ్వాస! 
రాజకీయం 
Read More...
నా పనితీరే నా బలం

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి రూ.60 వేలకుపైగా నష్టం..   ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బాధితుడి వేడుకోలు అక్షరదర్బార్, నడికూడ: నడికూడ మండలంలోని కంటాత్మకూరు...
Read More...
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి

జనసభలోనే నా ప్రయాణం!

- ఓడినా వెనుకడుగు వేయలేదు.. ప్రజల మధ్యే నిరంతర పోరాటం
రాజకీయం 
Read More...
జనసభలోనే నా ప్రయాణం!

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం టీపీయూఎస్‌ జిల్లా స్థాయి పురస్కారాలు అక్షరదర్బార్ నడికూడ: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) వరంగల్‌–హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం...
Read More...
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మూడు తరాలుగా సేవా సంకల్పం

మూడు తరాలుగా సేవా సంకల్పం ‘సేవా సంకల్ప్ అభియాన్‌’లో డా. సిరంగి సౌందరయ్య మనవడు రక్తదానం అక్షరదర్బార్,పరకాల: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల...
Read More...
మూడు తరాలుగా సేవా సంకల్పం