సబ్ ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్!

సబ్ ఇన్ స్పెక్టర్ సస్పెన్షన్!

  • అవినీతి ఆరోపణలపై విచారణ
  • నివేదిక అందగానే సస్పెన్షన్ ఉత్తర్వులు 
  • అక్రమార్కులపై వరంగల్ సిపి కొరడా 

అక్షరదర్బార్, హనుమకొండ: అవినీతి ఆరోపణలపై వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్సై)పై వేటు పడింది. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న రాజ్ కుమార్ ను సస్పెన్షన్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిసింది. ఇటీవలి కాలంగా ఎస్సై రాజ్ కుమార్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. తనకు అందిన ఫిర్యాదులపై విచారణ జరిపించిన తర్వాత నివేదిక అందగానే సీపీ అంబర్ కిషోర్ ఝా ఎల్కతుర్తి ఎస్సై రాజ్ కుమార్ సస్పెన్షన్ కు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్సై రాజ్ కుమార్ సస్పెన్షన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు, సిబ్బందిపై సీపీ అంబర్ కిషోర్ ఝా శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎల్కతుర్తి ఎస్సై రాజకుమార్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తుంది.

Tags:

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు