టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌

ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు
టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌

తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

* జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష 

* మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం 

* అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి ..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హైద‌రాబాద్‌: తెలంగాణలో టెట్ (టీచ‌ర్ ఎలిజ‌బులిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. అందులో భాగంగానే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఇక రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈక్రమంలోనే ఈరోజు నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. టెట్ పేప‌ర్‌-1కు డీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాగా... టెట్ పేప‌ర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇక టెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది సార్లు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌గా.. జ‌న‌వ‌రిలో ప‌దోసారి జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Tags: Ts tet

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర