ఆగని ఇసుక జీరో దందా!

ఆగని ఇసుక జీరో దందా!

  • కాటారంలో ఓ లారీని పట్టుకున్న పోలీసులు
  • జీరో ఇసుకను వదిలేసి పోయిన ఇసుక స్మగ్లర్లు 
  • చర్చనీయాంశమైన ఇసుక అక్రమ రవాణా 

ఆగని ఇసుక జీరో దందా! 

అక్షర దర్బార్​, కాటారంః
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లో​ నడుస్తున్న ఇసుక రీచుల్లో జీరో దందా ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట ఇసుక లారీలు పట్టుబడ్డట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నప్పటికినీ ఇసుక స్మగ్లర్లు అవేమి పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులకు తామిచ్చే ధనబలమో, లీడర్ల అండ బలమో తెలియదు కాని ఇసుక స్మగ్లర్లు దర్జాగా ఇసుక దందాను సాగిస్తున్న తీరు  సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.ఓ పరంగా ఆయా శాఖల అధికారులు ఇసుక స్మగర్లకు నడుపుకోండని మౌఖిక సంఘీభావం తెలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* పల్గుల క్వారీ నుండి 3 లారీలు..?

మహదేవపూర్​ సమీప గ్రామాలకు చెందిన ఇసుక లారీల యజమానులు పల్గుల క్వారీ నుండి  3 ఇసుక లారీల్లో జీరో ఇసుక నింపుకుని ఎస్కార్ట్ గా బయలుదేరినట్లు సమాచారం .ముందుగా ఓ ఇసుక లారీ కాటారం చెక్​ పోస్టు వద్దకు చేరుకోగా ఎలాంటి వేబిల్లు లేకపోవడంతో పోలీసులు పట్టుకున్నారు.అయితే వెనుకాలే వస్తున్న మరో రెండు లారీలకు పట్టుబడిన లారీ ఓనర్​ కమ్​ డ్రైవర్​ పట్టుబడ్డానని మీరు అటునుండి అటే పారిపోండని సమాచారం ఇచ్చాడు.దీంతో అప్రమత్తమైన సదరు ఇసుక లారీల ఓనర్లు,డ్రైవర్లు వెనక్కి తిప్పుకుని మహదేవపూర్​లోని అయ్యప్ప టెంపుల్​ వద్ద ప్రధాన రహదారి పక్కనే అన్లోడ్​ చేసి పారిపోయారు.ఈ విషయమై సంబంధిత ఓ పోలిస్​ అధికారికి వివరణ అడగ్గా బ్రేక్​ ఫెయులవ్వడంతో ఇసుకను అన్లోడ్​ చేసినట్లు చెప్పడం గమనార్హం.

Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర