అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
 
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
 
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
 
అక్షర దర్బార్,శాయంపేట 
 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఖండించారు. ఆదివారం నాడు శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంటులో అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే, అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడటం దేశ ప్రతిష్టతకు మంచిది కాదని అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.
 
అనంతరం 19 మంది సీఎంఆర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదికలో ఉచిత వరి విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. 
 
కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం..
 
 మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో రైతు వేదిక ముందే ఓ మాజీ ప్రజా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. అయితే  సబ్సిడీ విత్తనాల పంపిణీలో నాయకుల పేర్లు ఎంపిక చేయడం సరేంది కాదని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ను కొంతమంది గ్రామానికి చెందిన నాయకులు నిలదీశారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం  చోటుచేసుకోని  అక్కడినుండి  వెళ్ళిపోయారు.
 
అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టం:ఏవో గంగా జమున.
 
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వరి విత్తనాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా ఆదివారం నాడు పంపిణీ చేయడం జరిగింది. ఉచిత వరి విత్తనాలను ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని విలేకరులుగా అడగగా  అంతా అధికార పార్టీ నాయకులు వారి ఇష్టం. అధికార పార్టీ నాయకులు చెప్పింది చేయకపోతే మేము పనులు చేయలేమని గతంలో కూడా బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు నడుచుకున్నాం. మా చేతుల్లో ఏమీ లేదు అని మండల వ్యవసాయ శాఖ అధికారి గంగా జమున అనడం కొసమెరుపు.IMG-20241222-WA0764
Tags:

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..